Bigg Boss-7: తన గొయ్యి తానే తవ్వుకున్న అశ్విని.. సెల్ఫ్ నామినేషన్‌తో ఇంటి నుంచి బయటకు
బిగ్ బాస్ సీజన్ 7 లో 11 వ వారం కూడా సక్సెస్ ఫుల్‌గా పూర్తయి ఈ వీక్ చివరి దశకు చేరుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 లో 11 వ వారం కూడా సక్సెస్ ఫుల్‌గా పూర్తయి ఈ వీక్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ వారంలో జరిగిన ఎవిక్షన్ పాస్ టాస్క్‌లో పల్లవి ప్రశాంత్ మరోసారి తన ఆటతనాన్ని చూపించి ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్నాడు. తర్వాత కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ కాగా.. అందులో అర్జున్, అమర్ నిలిచారు. అయితే వీరిద్దరిలో ఒకరు కెప్టెన్ కావాల్సి ఉండగా.. అర్జున్‌కు శివాజీ, అమర్‌కు శోభా సపోర్ట్‌గా నిలుస్తారు. ఇక చివరి వరకు ఇద్దరిలో ఒకరిని కెప్టెన్‌గా నియమించుకోకపోవడంతో ఆ కెప్టెన్సీని రద్దు చేస్తాడు బిగ్ బాస్.
ఇదిలా ఉంటే.. ఈ వారం చివరి దశకు చేరుకోగా ఇప్పటికే ఓటింగ్ సెక్షన్ కంప్లీట్ అయింది. అయితే.. ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున గత వారమే తెలిపారు. అయినప్పటికీ చాలా ఫూలిష్‌గా అశ్విని సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటుంది. నాకు నామినేట్ చేయడానికి ఎవరి మీద రీజన్స్ లేవు. సిల్లీ రీజన్స్‌తో నేను నామినేట్ చెయ్యను అని చెప్పడంతో బిగ్ బాస్ అశ్వినీని నేరుగా నామినేట్ చేస్తాడు. ఇక్కడే అశ్విని తన గొయ్యి తాను తవ్వుకున్నట్లు అయింది. ఈ వారం డబల్ ఎలిమినేషన్ కాగా.. మొదటి అశ్విని ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక రెండో ఎలిమినేషన్ ఎవరు అయ్యారు అనేది తెలియాల్సి ఉంది.