బిగ్‌బాస్-7: హౌస్‌లో కుప్పకూలిపోయిన అమర్ దీప్ .. ఆ సమస్య ఉందని క్లారిటీ ఇచ్చిన స్నేహితుడు!

తెలుగు బిగ్‌బాస్ షో ఇంకా నాలుగు వారాల్లో విన్నర్ ఎవరో తేలనుంది. చివరికి రావడంతో కంటెస్టెంట్స్ టాస్క్ లో పాల్గొంటూ గట్టి పోటీని ఇస్తున్నారు.

Update: 2023-11-24 09:27 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బిగ్‌బాస్ షో ఇంకా నాలుగు వారాల్లో విన్నర్ ఎవరో తేలనుంది. చివరికి రావడంతో కంటెస్టెంట్స్ టాస్క్ లో పాల్గొంటూ గట్టి పోటీని ఇస్తున్నారు. ఇందులోని కంటెస్టెంట్ అమర్ దీప్ తన ఆటతో ముందున్నాడు. అయితే హౌస్‌లో అమర్‌ అస్వస్థతకు లోనయ్యాడని, ఫిట్స్ వచ్చి పడిపోవడంతో సడిపోవడంతో మెడిరూమ్‌కి తీసుకెళ్లి చికిత్స చేశారట.

తాజాగా, అమర్ స్నేహితుడు నరేష్ స్పందించాడు. ‘‘ అతనికి ఫిట్స్ వచ్చాయంటూ వస్తున్న వార్తలు నిజమే. అతనికి నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నీతోనే డాన్స్ షోలో శారీరకంగా, మానసికంగా చాలా బలహీన మయ్యాడు. విశ్రాంతి తీసుకోకుండా పని చేయడంతో చాలా ఇబ్బందిపడ్డాడు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. అక్కడికి వెళ్లాక మాకు తెలిసిందేంటంటే.. అమర్ శరీరంలో కండరాల ఎదుగుదల జీరో అయిపోయింది. రెండు నెలల నుంచి అతడికి మజిల్ గ్రోత్ లేదు. అది తనకు పెద్ద బ్యాక్‌డ్రాప్. బిగ్‌బాస్ షోకు వెళ్లే రెండు రోజుల ముందు మాత్రమే తను ప్రశాంతంగా కంటి నిండా నిద్ర పోయాడు. కానీ ఇంట్లో ఎక్కువగా లోనవుతున్నాడు. గేమ్‌లోనూ ఆ సమస్యను లెక్క చేయకుండా బాగా ఆడుతున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు.


Similar News