బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్‌పై అట్రాసిటీ కేసు నమోదు!

తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ బిగ్‌బాస్ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది.

Update: 2023-11-16 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ బిగ్‌బాస్ రియాలిటీ షో టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతుంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో కొన్ని నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. షోలో తోటి కంటెస్టెంట్లతో బూతులు మాట్లాడకూడదు. ఒకరిపై మరొకరు దాడి చేయకూడదు. హౌస్‌లో గొడవలు కామన్ అయినప్పటికీ హద్దులు మీరి మాట్లాడితే కొన్నిసార్లు వాటి పరిణామాలు వేరేలా ఉంటాయి. ఇలాంటి పరిస్థితే కన్నడ బిగ్‌బాస్ లేడీ కంటెస్టెంట్‌కు వచ్చింది. కన్నడ బిగ్‏బాస్ సీజన్ - 10 కు నటుడు సుధీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న రియాలిటీ షో లో నటి తనీషా కుప్పండ కంటెస్టెంట్‌గా పాల్గొంది. రీసెంట్ ఎపిసోడ్‌లో తనీషా తన తోటి కంటెస్టెంట్ డ్రోన్ ప్రతాప్‏ను ‘వడ్డా’ అని పిలిచింది.

దీంతో అఖిల కర్ణాటక రాష్ట్ర అధ్యక్షురాలు భోవి సమాజ్ పి పద్మ బెంగళూరు శివార్లలోని కుంబళగోడు పోలీస్ స్టేషన్‌లో తనీషాపై కంప్లైంట్ చేశారు. తానీషా భోవి కమ్యూనిటీని కించపరిచేలా మాట్లాడారని పద్మ ఆరోపించింది. తనీషాతోపాటు మరొక టీవీ ఛానెల్ పై కూడా కేసు పెట్టారు. దీంతో పోలీసులు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తానీషాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా కొన్ని రోజుల పాటు తనీషా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవిక్షన్ కావడం లేదా డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యే చాన్స్‌లు కనిపిస్తున్నాయి. 




Similar News