Bike Tank: మీ బైక్‌ ఫ్యూయల్ ట్యాంక్‌లోకి నీరు చేరిందా.. అయితే, ఇలా సులభంగా క్లీన్ చేయండి!

మీ బైక్‌ ఫ్యూయల్ ట్యాంక్‌లోకి నీరు చేరిందా..

Update: 2024-08-27 05:58 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం అందరి దగ్గర బైక్‌ ఉంటుంది. కొన్ని సార్లు రిపేర్లు అవుతుంటాయి. ఇది చాలా సహజం. అయితే ఈ వర్షాకాలంలో కొంచం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద వానలు పడినప్పుడు బైక్‌ ఫ్యూయల్ ట్యాంక్‌లోకి నీరు వెళ్తుంది.. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక బైక్ రిపేర్ షాప్ దగ్గరికి తీసుకువెళ్దాం అనుకుంటారు కానీ, ఎంత సేపటికి బైక్‌ స్టార్ట్‌ కాదు. ఎక్కువ సేపు పట్టించుకోకుండా అలాగే వదిలేస్తే ఇంజిన్ మీద ప్రభావం చూపుతుంది. ఈ సమస్యకు ఇక్కడ కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..

బైక్ ట్యాంక్‌లోకి నీరు వెళితే ఇలా చేయండి

ట్యాంక్‌ను ఖాళీ చేయండి: మీరు ముందుగా బైక్‌లోని పెట్రోల్ ట్యాంక్‌ను మొత్తాన్ని వేరే బాటిల్ లోకి తీసుకోండి.

ఇంధన ఫిల్టర్‌ : బైక్ లో ఫ్యూయల్ ఫిల్టర్ ఉంటే, దాన్ని కూడా తనిఖీ చేయండి.

ట్యాంక్‌ను ఆరబెట్టండి: పొడి క్లాత్ తీసుకుని తడి లేకుండా మొత్తం క్లీన్ చేయాలి.

కొత్త పెట్రోల్‌ : ట్యాంక్ మొత్తం ఆరిపోయిన తర్వాత ట్యాంకు మూత తీసి కొత్త పెట్రోల్‌ను పోయండి.

ఇంజిన్ ఆయిల్‌: ఇంజిన్‌లోకి నీరు వెళ్ళినట్లయితే ఇంజిన్ ఆయిల్‌ను మార్చడం మంచిది.

ఇంజిన్ తనిఖీ: కొత్త పెట్రోల్ వేసాక కూడా ఇలాంటి సమస్య మళ్ళీ వస్తుంటే బైక్‌ను సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లండి. 

Tags:    

Similar News