చిన్న వ్యాపారులకు ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వరా..?
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల(ఎస్ఎంబీ) నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనాలను 88 శాతం మంది ఇంకా పొందలేదని తెలుస్తోంది. కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(సీఐఏ), తన 40 ఎస్ఎంబీ భాగస్వామ్య అసోసియేషన్లతో నిర్వహించిన సర్వేలో 2020-21లో ఎస్ఎంబీలలో 73 శాతం మంది ఉద్దీపన ప్యాకేజీ లాభాలను పొందలేదని తేలింది. కొవిడ్ లాక్‌డౌన్, ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం వల్ల 59 శాతం మంది […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వయం ఉపాధి, సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారాల(ఎస్ఎంబీ) నుంచి సేకరించిన వివరాల ప్రకారం.. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ ప్రయోజనాలను 88 శాతం మంది ఇంకా పొందలేదని తెలుస్తోంది. కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(సీఐఏ), తన 40 ఎస్ఎంబీ భాగస్వామ్య అసోసియేషన్లతో నిర్వహించిన సర్వేలో 2020-21లో ఎస్ఎంబీలలో 73 శాతం మంది ఉద్దీపన ప్యాకేజీ లాభాలను పొందలేదని తేలింది. కొవిడ్ లాక్‌డౌన్, ఆర్థిక కార్యకలాపాల్లో అంతరాయం వల్ల 59 శాతం మంది తమ సిబ్బందిని తొలగించారని చెప్పారు. 42 శాతం మంది తిరిగి నియమించడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు. ఈ సర్వేలో వాటాదారుల నుంచి సీఐఏ సలహాలను కోరగా, ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సూక్ష్మ, చిన్న వ్యాపారులకు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ద్వారా ఇచ్చే రుణాల గడువును ఇప్పుడున్న 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచాలని కోరారు. రూ. 5 కోట్ల టర్నోవర్ కలిగిన అన్ని మైక్రో వ్యాపారాలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశారు.