ఆ స్థలాన్ని పరిరక్షించాలని హెచ్ఆర్సీ ఆదేశాలు
దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 84ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని సీపీ సజ్జనార్‌ను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మహాప్రస్థానం సమీపంలోని 84ఎకరాల భూమి ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సూచించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను హెచ్ఆర్సీ బుధవారం జారీ చేసింది. ఈ సందర్భంగా అడ్వకేట్ కేసీరెడ్డి మాట్లాడుతూ 84ఎకరాల భూమి అక్బర్ హుస్సేనీ నుంచి వారసత్వంగా అజీజుల్లా హుస్సేనీకి వచ్చినట్టుగా పేర్కొన్నారు. అయితే, డెవలప్మ్ంట్ చేసేందుకు 1998లో లార్వెన్ ప్రాజెక్టు […]
దిశ, క్రైమ్‌బ్యూరో: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 84ఎకరాల స్థలాన్ని పరిరక్షించాలని సీపీ సజ్జనార్‌ను మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మహాప్రస్థానం సమీపంలోని 84ఎకరాల భూమి ఎలాంటి ఆక్రమణలకు గురికాకుండా చూడాలని సూచించింది. అందుకు సంబంధించిన ఉత్తర్వులను హెచ్ఆర్సీ బుధవారం జారీ చేసింది. ఈ సందర్భంగా అడ్వకేట్ కేసీరెడ్డి మాట్లాడుతూ 84ఎకరాల భూమి అక్బర్ హుస్సేనీ నుంచి వారసత్వంగా అజీజుల్లా హుస్సేనీకి వచ్చినట్టుగా పేర్కొన్నారు. అయితే, డెవలప్మ్ంట్ చేసేందుకు 1998లో లార్వెన్ ప్రాజెక్టు తీసుకున్నట్టు చెప్పారు. నాటి నుంచి ఎలాంటి డెవలప్ చేయకపోవడమే గాక ఆక్రమణలకు గురవుతుందంటూ వాపోయారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. హెచ్ఆర్సీని ఆశ్రయించినట్టుగా తెలిపారు.