విద్యుత్ శాఖ నిర్లక్ష్యం.. 8 బర్రెలు మృతి

దిశ, మెదక్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా 8 బర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం అత్తాపూర్ గ్రామ శివారులోని బీరప్ప ఆలయం వద్ద శనివారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..పస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు 8 బర్రెలు పెంచుకుంటూ వాటి పాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.ఈరోజు ఉదయం 7గంటల ప్రాంతంలో బర్రెలను మేపేందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో విద్యుత్ వైర్లు తెగి బర్రెల మీద పడటంతో మొత్తం 8 బర్రెలు అక్కడికక్కడే మృత్యువాత […]

Update: 2020-04-10 23:03 GMT

దిశ, మెదక్: విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా 8 బర్రెలు మృతి చెందాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం అత్తాపూర్ గ్రామ శివారులోని బీరప్ప ఆలయం వద్ద శనివారం చోటుచేసుకుంది.వివరాల్లోకివెళితే..పస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ రైతు 8 బర్రెలు పెంచుకుంటూ వాటి పాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నాడు.ఈరోజు ఉదయం 7గంటల ప్రాంతంలో బర్రెలను మేపేందుకు తీసుకెళ్లాడు. అదే సమయంలో విద్యుత్ వైర్లు తెగి బర్రెల మీద పడటంతో మొత్తం 8 బర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. కళ్ల ఎదుటే తన పశువులు విగతజీవులుగా మారడంతో యజమాని కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న ప్రజలు ఘటనా స్థలికి చేరుకుని ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. చనిపోయిన 8గేదెలకు రూ.10లక్షల నష్టపరిహారం చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం కూడా బర్రెల యజమానిని ఆదుకోవాలని స్థానికులు కోరారు.

Tags: electricity department, neglect, 8 buffellows died, sanga reddy dist

Tags:    

Similar News