కరిచిన పామును చంపి ఆసుపత్రికి తీసుకెళ్లిన బాలుడు.. ఎందుకో తెలుసా..?

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పిల్లలు చిన్న పురుగును చూస్తేనే భయపడి ఏడుపు లంకించుకుంటారు. అలాంటిది ఒళ్లంతా  విషం నింపుకున్న పాము కనిపిస్తే.. వారి పై ప్రాణాలు పైనే పోతాయి. పాము అంటే చిన్న పిల్లకే కాదు పెద్దవారికి కూడా భయమే. అది కాటేస్తే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రికి పరిగెడతాం. కానీ, ఈ ఏడేళ్ల బుడతడు పాము కాటేస్తే భయపడలేదు సరి కదా సాహసం చేశాడు.. దాని వెంటపడి మరీ చంపి  దాన్ని భుజాన వేసుకొని హాస్పిటల్ […]

Update: 2021-07-29 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా పిల్లలు చిన్న పురుగును చూస్తేనే భయపడి ఏడుపు లంకించుకుంటారు. అలాంటిది ఒళ్లంతా విషం నింపుకున్న పాము కనిపిస్తే.. వారి పై ప్రాణాలు పైనే పోతాయి. పాము అంటే చిన్న పిల్లకే కాదు పెద్దవారికి కూడా భయమే. అది కాటేస్తే.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రికి పరిగెడతాం. కానీ, ఈ ఏడేళ్ల బుడతడు పాము కాటేస్తే భయపడలేదు సరి కదా సాహసం చేశాడు.. దాని వెంటపడి మరీ చంపి దాన్ని భుజాన వేసుకొని హాస్పిటల్ కి వెళ్లి చికిత్స తీసుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సాహస ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది.

వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని కాంచీపురం ఏకనాంపేట్టకు చెందిన రాము కుమారుడు దర్షిత్‌ (7) మూడో తరగతి చదువుతున్నాడు. స్కూల్ కి సెలవులు కావడంతో ఈనెల 16వ తేదీన వెల్‌లైకోట్టై గ్రామంలోని తన అవ్వ వద్దకు వెళ్లి పొలంలో ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దర్షిత్ కాలికి ఏదో గుచ్చినట్లు అనిపించింది. వెంటనే బాలుడు పొదలలో చూడగా.. ఓ పాము పాకుతూ వెళ్తుండడం కనిపించింది. అమ్మో.. పాము కాటేసింది అని పిల్లడు ఏడవలేదు.. పెద్దలకు చెప్పలేదు. ఆ పాము వెంటపడి రాయి తో కొట్టి కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆ పామును భుజాన వేసుకొని ఇంటికెళ్లి తల్లిదండ్రులకు చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు బాలుడిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లారు.

పాము కాటేసినా బాలుడిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో రెండురోజులు ఆస్పత్రిలో ఉంచి పంపించేశారు. అయితే ఆ తరువాత బాలుడి కాలు వాచిపోయి ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం చెన్నై ఎగ్మూరులోని ప్రభుత్వ పిల్లల ఆస్పత్రికి తరలించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జ్‌ చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే వైద్యులు బాలుడిని ఒక ప్రశ్న అడిగారు. పాము కాటేస్తే ఆసుపత్రికి రాకుండా.. పామును చంపి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగారు. దానికి బాలుడు “నన్ను ఏ జాతి పాము కాటేసిందో తెలిస్తేనే కదా మీరు తగిన చికిత్స అందించేది” అని బదులివ్వడంతో వైద్యులు బిత్తరపోయారు. ఏడేళ్ల బాలుడి సాహసాన్ని అందరు ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News