ఈ రోజు ఆ బ్యాంకులో డబ్బులు పెడితే.. అదృష్టం పట్టినట్టే

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో డబ్బులు ఉన్నాయా.. వాటిని భద్రంగా దాచుకోవడమే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఆశిస్తున్నారా.. అయితే మీకోసమే ఈ తీపి కబురు. ఒక బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇందులో మీరు మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీకు మంచి లాభం ఉంటుంది. ఇంతకు ఆ బ్యాంకు ఏంటీ అనుకుంటున్నారా.. డీసీబీ బ్యాంకు. ఇది తమ కస్టమర్లకు ఎఫ్‌డీలపై అధిక రాబడిని అందిస్తోంది. మూడేళ్ల […]

Update: 2021-08-16 01:50 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లో డబ్బులు ఉన్నాయా.. వాటిని భద్రంగా దాచుకోవడమే కాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీని ఆశిస్తున్నారా.. అయితే మీకోసమే ఈ తీపి కబురు. ఒక బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ వడ్డీ రేట్లను అందిస్తోంది. ఇందులో మీరు మీ డబ్బును ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తే మీకు మంచి లాభం ఉంటుంది. ఇంతకు ఆ బ్యాంకు ఏంటీ అనుకుంటున్నారా.. డీసీబీ బ్యాంకు. ఇది తమ కస్టమర్లకు ఎఫ్‌డీలపై అధిక రాబడిని అందిస్తోంది. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 7.11 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. డబ్బులు ఎఫ్‌డీ చేయాలని భావించే వారు ఈజీగా ఈ బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చెయ్యచ్చు.

మరిన్ని ముఖ్యమైన విషయాలు..

  1. ఆగస్ట్ 16వ తేదీలోపు ఎఫ్‌డీ తెరిచిన వారికే ఈ ప్రయోజనం లభిస్తుంది.

  2. మూడేళ్ల కాల పరిమితిలోని ఎఫ్‌డీలపై 7.11 శాతం వడ్డీని డీసీబీ బ్యాంకు ఆఫర్ చేస్తోంది.

  3. ఎఫ్‌డీ చేయాలని భావించే వారు ఈజీగా ఫిక్స్‌డ్ డిపాజిట్ చెయ్యచ్చు.

  4. డబ్బులు ఎఫ్‌డీ చేయాలని భావించే వారు ఆన్‌లైన్‌ లోనే బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా చేయొచ్చు.

  5. బ్యాంక్‌ లో సేవింగ్స్ ఖాతా లేక పోయినా డీసీబీ బ్యాంక్ జిప్పి ఆన్‌లైన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌‌లో చేరడానికి అవకాశం ఉంది.

  6. కస్టమర్లు వారి బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా డబ్బులను ఆన్‌లైన్‌లో కొత్త ఎఫ్‌డీ స్కీమ్‌ లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు.

  7. ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 345 బ్రాంచులు ఉన్నాయి.

Tags:    

Similar News