ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరో రోజు అప్‌డేట్స్
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరో రోజు ప్రేక్షకులను అనుమతించలేదు. మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్ విధించడంతో ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లు నిర్వహించారు. మెన్స్ సింగిల్స్‌లో డానిల్ మెద్వదేవ్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. ఫిలిప్ క్రజినోవిక్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-3, 4-6, 3-6, 6-0 తేడాతో విజయం సాధించి 4వ రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గతంలో ఐదు సెట్‌ల మ్యాచ్ ఆడినప్పుడు వరుసగా ఆరు సార్లు ఓడిపోయిన మెద్వెదేవ్ ఈ విజయంతో తన చెత్త రికార్డును తుడిచిపెట్టాడు. మెద్వెదేవ్‌కు […]
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆరో రోజు ప్రేక్షకులను అనుమతించలేదు. మెల్‌బోర్న్‌లో లాక్‌డౌన్ విధించడంతో ఖాళీ స్టేడియంలలోనే మ్యాచ్‌లు నిర్వహించారు. మెన్స్ సింగిల్స్‌లో డానిల్ మెద్వదేవ్ తన విజయపరంపరను కొనసాగిస్తున్నాడు. ఫిలిప్ క్రజినోవిక్‌తో జరిగిన మ్యాచ్‌లో 6-3, 6-3, 4-6, 3-6, 6-0 తేడాతో విజయం సాధించి 4వ రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. గతంలో ఐదు సెట్‌ల మ్యాచ్ ఆడినప్పుడు వరుసగా ఆరు సార్లు ఓడిపోయిన మెద్వెదేవ్ ఈ విజయంతో తన చెత్త రికార్డును తుడిచిపెట్టాడు. మెద్వెదేవ్‌కు ఇది వరుసగా 17వ విజయం కావడం గమనార్హం. ఐదో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ 6-4, 6-1, 6-1 తేడాతో స్వీడన్‌కు చెందిన మైఖేల్ యమెర్‌పై విజయం సాధించాడు. రష్యాకు చెందిన ఆండ్రీ రూబ్లెవ్ 7-5, 6-2, 6-3 తేడాతో స్పెయిన్‌కు చెందిన ఫెలిసియానో లోపెజ్‌పై విజయం సాధించి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది రూబ్లెవ్‌కి ఇది 7వ విజయం.
ఇక ఉమెన్స్ సింగిల్స్‌లో వరల్డ్ నెంబర్ వన్ ఆష్ బార్టీ 6-2, 6-4 తేడాతో అలెగ్జాండ్రనోవాపై విజయం సాధించి నాలుగో రౌండ్‌కి చేరింది. 2019లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన బార్టీ.. సొంత గడ్డపై ఆస్ట్రేలియా ఓపెన్ చాంపియన్‌గా నిలవాలని ఉవ్వీళ్లూరుతున్నది. 1978 తర్వాత ఒక్క ఆసీస్ మహిళ కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలవలేదు. ఉమెన్స్ సింగిల్స్‌లో 5వ సీడ్ ఎలీనా స్వితొలీనా 6-4, 6-0 తేడాతో యూలియ పుతిన్‌త్సెవాపై విజయం సాధించింది. కాగా, 6వ సీడ్, చెక్ రిపబ్లిక్‌కి చెందిన కరోలినా ప్లిస్కోవా తమ దేశానికే చెందిన కరోలినా ముచోవాపై 5-7, 5-7 తేడాతో ఓడిపోయింది. వీరితో పాటు బెల్జియంకు చెందిన ఎలిస్ మెర్టిన్స్, క్రొయేషియాకు చెందిన డొన్నా వెకిక్, అమెరికాకు చెందిన జెన్నిఫర్ బ్రాడీ కూడా 4వ రౌండ్‌కు చేరుకున్నారు.
అమెరికాకు చెందిన జెస్సిక పేగుల ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్టినా లడెనోవిక్‌పై 6-2, 6-1 తేడాతో విజయం సాధించి తొలి సారిగా గ్రాండ్‌స్లామ్ టోర్నీలో 4వ రౌండ్‌కు చేరుకున్నది.