మృత్యుఒడి నుంచి బయటపడ్డ వృద్ధుడు.. వీడియో వైరల్

దిశ, వెబ్‌డెస్క్ : రెప్పపాటు క్షణం ఆలస్యమైనా.. రైల్వే కానిస్టేబుల్ సాయం చేయకపోయినా.. అతను మృత్యుఒడిలో సేదతీరేవాడు. కానీ, ఇంకా ఆ వృద్ధుడికి భూమ్మీద నూకలున్నట్లున్నాయి. తృటిలో మృత్యువును జయించాడు. రైల్వేస్టేష‌న్‌లోని ఒక‌ ప్లాట్‌ఫామ్ నుంచి మ‌రో ప్లాట్‌ఫామ్‌కు ట్రాక్ దాట‌బోయి ప్రమాదపు అంచుల వరకు వెళ్లాడు. చివరకు కానిస్టేబుల్ సాయంతో క్షేమంగా బయటపడ్డాడు. ముంబైలోని ద‌హిసార్ రైల్వేస్టేష‌న్‌లో శుక్రవారం ఈ ఘ‌ట‌న జరిగింది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు స్టేష‌న్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మ‌రో […]

Update: 2021-01-02 03:57 GMT
మృత్యుఒడి నుంచి బయటపడ్డ వృద్ధుడు.. వీడియో వైరల్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : రెప్పపాటు క్షణం ఆలస్యమైనా.. రైల్వే కానిస్టేబుల్ సాయం చేయకపోయినా.. అతను మృత్యుఒడిలో సేదతీరేవాడు. కానీ, ఇంకా ఆ వృద్ధుడికి భూమ్మీద నూకలున్నట్లున్నాయి. తృటిలో మృత్యువును జయించాడు. రైల్వేస్టేష‌న్‌లోని ఒక‌ ప్లాట్‌ఫామ్ నుంచి మ‌రో ప్లాట్‌ఫామ్‌కు ట్రాక్ దాట‌బోయి ప్రమాదపు అంచుల వరకు వెళ్లాడు. చివరకు కానిస్టేబుల్ సాయంతో క్షేమంగా బయటపడ్డాడు.

ముంబైలోని ద‌హిసార్ రైల్వేస్టేష‌న్‌లో శుక్రవారం ఈ ఘ‌ట‌న జరిగింది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు స్టేష‌న్‌లోని ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మ‌రో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేందుకు ట్రాక్‌ దాటుతున్నాడు. ఈ క్రమంలో అత‌ని చెప్పు ఊడి ప‌ట్టాల‌పై ప‌డిపోయింది. సరిగ్గా అదే టైమ్‌కు.. అదే ట్రాక్‌పై వస్తున్న ట్రైన్‌ను ప‌ట్టించుకోకుండా ఆ వ్యక్తి చెప్పు కోసం మ‌ళ్లీ ప‌ట్టాల మీద‌కు వెళ్లాడు. అప్పటికే ట్రైన్ అత్యంత స‌మీపానికి చేరుకుంది. ఇది గ‌మ‌నించిన రైల్వే కానిస్టేబుల్ ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చి ప‌ట్టాల‌పై ప‌డుకోమ‌ని వృద్ధుడికి సైగ చేశాడు. కానీ, ఆ వృద్ధుడు అత‌ని సూచ‌న పాటించ‌కుండా రైలు కేవ‌లం కొన్ని అడుగుల దూరం ఉండ‌గానే దాని ముందు నుంచి ప్లాట్‌ఫాం వైపు ప‌రుగెత్తుకొచ్చాడు. అప్పటికే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వృద్ధుడి చేయిప‌ట్టి లాగేయడంతో ప్రమాదం త‌ప్పింది.

వృద్ధుడిని ప‌ట్టాల‌పై నుంచి లాగి ప‌డేసిన కానిస్టేబుల్‌, అత‌నితోపాటే ప్లాట్‌ఫాంపై ప‌డిపోయాడు. చెప్పుల కోసం వెళ్లేముందు ప్లాట్‌ఫాంపైకి ట్రైన్ వస్తుందో లేదా చూసుకోవా? అంటూ ఆ వృద్ధుడి త‌ల‌పై గ‌ట్టిగా ఒక్కటి పీకాడు. వృద్ధుడి ప్రాణాలు కాపాడినందుకు రైల్వే ఆఫీసర్లు కానిస్టేబుల్‌ను అభినందించారు. ఘటనకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేయగా.. చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వృద్ధుడు స్టుపిడిటీతో వ్యవహరించాడని, కానిస్టేబుల్ సాయం చేయకుంటే అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవాని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. కానిస్టేబుల్ వృద్ధుడిని కొట్టడం సబబేనంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. నిజమే మరి.. చెప్పులు పోతే మళ్లీ కొనుక్కోవచ్చు. కానీ, ప్రాణాలు కోల్పోతే తిరిగి పొందలేం కదా!

Tags:    

Similar News