56 ఏళ్ల ఉపాధ్యాయుడు విద్యార్థినిని క్లాస్ రూంలోనే..

దిశ, వెబ్‌డెస్క్ : అందరికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు శృతిమించిపోయాడు. విద్యార్థులను క్రమ శిక్షణలో ఉంచాల్సిందిపోయి తానే దారి తప్పడు. 56 ఏళ్ల వయసులో మనవరాలి వయసు ఉన్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట్ల తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. విద్యార్థినికి ఇష్టం లేకపోయిన ఆమెను బలవంతంగా దగ్గరకు లాక్కోని కేక్ పెట్టాడు. అసభ్యకరంగా తాకుతూ ముఖానికి కేక్ పూసి అదిమి పట్టాడు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై ఆ రాష్ట్రంలో పెను దుమారం […]

Update: 2021-09-12 08:09 GMT
sexual harassment
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : అందరికి ఆదర్శవంతంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు శృతిమించిపోయాడు. విద్యార్థులను క్రమ శిక్షణలో ఉంచాల్సిందిపోయి తానే దారి తప్పడు. 56 ఏళ్ల వయసులో మనవరాలి వయసు ఉన్న విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను తాకరాని చోట్ల తాకుతూ పైశాచికంగా ప్రవర్తించాడు. విద్యార్థినికి ఇష్టం లేకపోయిన ఆమెను బలవంతంగా దగ్గరకు లాక్కోని కేక్ పెట్టాడు. అసభ్యకరంగా తాకుతూ ముఖానికి కేక్ పూసి అదిమి పట్టాడు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనపై ఆ రాష్ట్రంలో పెను దుమారం లేపింది.

యూపీలోని రామ్‌పూర్ పాఠశాలకు చెందిన 56 ఏళ్ల ఉపాధ్యాయుడు అదే స్కూళ్లో ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. క్లాస్ రూంలోనే కేక్ కట్ చేసి విద్యార్థినిని బలవంతంగా దగ్గరకు లాక్కోని కేక్ ముఖానికి రాశాడు. ఆ సమయంలో బాలిక అతడి చెర నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. అయినా ఆ ఉపాధ్యాయుడు బాలికను గట్టిగా పట్టుకోని కేక్ పూశాడు. ‘నిన్నెవరు కాపాడుతారు.. ఎవరైన వచ్చారా’ అంటూ గట్టిగా అదిమి పట్టుకున్నాడు.

ఆ ఘటనను విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దానిని చూసిన బాలిక తండ్రి స్కూల్ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వీడియోను ముందే పసిగట్టిన స్కూల్ యాజమాన్యం విషయం వివాదస్పదం అవుతుందనే కారణంతో సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసింది. ఆ ఘటన కూడా స్కూళ్లో జరగలేదని టీచర్స్ డే సందర్భంగా మరో కోచింగ్ సెంటర్‌లో జరిగిందని వివరణ ఇచ్చింది. ఉపాధ్యాయుడిపై పోలీసులు పొక్సో యాక్ట్, సెక్షన్ 354ప్రకారం కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News