ఏపీలో 5,292 కరోనా కేసులు
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24గంటల్లో 66,944 మందికి పరీక్షలు నిర్వహించగా 5,292మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7లక్షల 39వేల 719కి చేరింది. 42మంది చనిపోవడంతో మొత్తం కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,128గా ఉంది. ప్రస్తుతం 48,661 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6లక్షల 84వేల 930మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 6,102మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 63లక్షల 49వేల 953మందికి […]
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24గంటల్లో 66,944 మందికి పరీక్షలు నిర్వహించగా 5,292మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 7లక్షల 39వేల 719కి చేరింది. 42మంది చనిపోవడంతో మొత్తం కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 6,128గా ఉంది. ప్రస్తుతం 48,661 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 6లక్షల 84వేల 930మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 6,102మంది కోలుకున్నారు. రాష్ట్రంలో 63లక్షల 49వేల 953మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.
కరోనా మహమ్మారి బారిన పడి ప్రకాశం జిల్లాలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, అనంతపురం జిల్లాలో నలుగురు, నెల్లూరులో నలుగురు, విశాఖలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, కడపలో ముగ్గురు, గుంటూరులో ముగ్గురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, విజయనగరం జిల్లాలో ఒకరు చనిపోయారు.
అనంతపురం జిల్లాలో 362మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా చిత్తూరులో 784, తూర్పుగోదావరిలో 652, గుంటూరులో 493, కడపలో 323, కృష్ణా జిల్లాలో 399, కర్నూలులో 175, నెల్లూరులో 311, ప్రకాశంలో 591, శ్రీకాకుళంలో 204, విశాఖపట్నంలో 198, విజయనగరంలో 188, పశ్చిమగోదావరి జిల్లాలో 612మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్ వెల్లడించింది.