భారత్‌కు 5 కోట్ల ఫైజర్ డోసులు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో వ్యాక్సిన్స్ కొరతతో భారత్ ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు 5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల్ని అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ డోసులు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి భారత్‌కు చేరుకుంటాయని సమాచారం. ఈ మేరకు వ్యాక్సిన్ లభ్యత గురించి ఫైజర్ కంపెనీకి, భారత ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగినట్టు సమాచారం. అయితే, తమ దేశంలో ఉన్న డిమాండ్‌కు […]
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్‌లో వ్యాక్సిన్స్ కొరతతో భారత్ ఇబ్బందులు పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్‌కు 5 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసుల్ని అందించేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ డోసులు ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి భారత్‌కు చేరుకుంటాయని సమాచారం. ఈ మేరకు వ్యాక్సిన్ లభ్యత గురించి ఫైజర్ కంపెనీకి, భారత ప్రభుత్వానికి మధ్య చర్చలు జరగినట్టు సమాచారం.
అయితే, తమ దేశంలో ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా వ్యాక్సిన్ ఉత్పత్తి జరిగే వరకు తమ దేశంలో ఉత్పత్తి అవుతున్న ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతిచ్చే ప్రసక్తే లేదనీ యూఎస్ ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంది. ఈ నేపథ్యంలో యూరప్ దేశాల్లో ఫైజర్ ఉత్పత్తి చేస్తున్న కేంద్రాల నుంచే భారత్‌కు ఈ స్టాక్ అందించాల్సి ఉంటుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.