కోదాడ, హుజూర్‌నగర్‌లలో 42 పాజిటివ్ కేసులు

దిశ, కోదాడ, హుజూర్‌నగర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా హుజూర్‌నగర్‌లో 22, కోదాడలో 20 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఆయా మండలాల వైద్యాధికారులు వెల్లడించారు. హుజూర్‌నగర్‌లోని నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 95 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 21 మందికి పాజిటివ్ వచ్చింది. అంతేగాకుండా పెంచికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 52 మందికి పరీక్షలు నిర్వహించగా, […]

Update: 2020-08-25 08:54 GMT

దిశ, కోదాడ, హుజూర్‌నగర్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతూ.. విలయతాండవం చేస్తోంది. తాజాగా హుజూర్‌నగర్‌లో 22, కోదాడలో 20 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు ఆయా మండలాల వైద్యాధికారులు వెల్లడించారు.

హుజూర్‌నగర్‌లోని నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 95 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 21 మందికి పాజిటివ్ వచ్చింది. అంతేగాకుండా పెంచికల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 52 మందికి పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్ నమోదైంది.

కోదాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 49 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 20 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో కాంటాక్ట్ అయిన వారి వివరాలు సేకరించి, పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు.

Tags:    

Similar News