భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద గురువారం భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ.62లక్ష‌లు ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం టౌన్ ఎస్ఐ మహేష్, సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ పోలీసులు కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. […]

Update: 2020-08-06 08:03 GMT
భ‌ద్రాచ‌లంలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌
  • whatsapp icon

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భ‌ద్రాచ‌లం ఫారెస్ట్ చెక్‌పోస్టు వ‌ద్ద గురువారం భారీగా గంజాయి ప‌ట్టుబ‌డింది. సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఇద్ద‌రు నిందితుల‌ను అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

దాని విలువ సుమారు రూ.62లక్ష‌లు ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు. భద్రాచలం ఏఎస్పీ రాజేష్ చంద్ర ఐపీఎస్ కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7గంటల ప్రాంతంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద భద్రాచలం టౌన్ ఎస్ఐ మహేష్, సిబ్బంది మరియు సీఆర్పీఎఫ్ పోలీసులు కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో తనిఖీల్లో భాగంగా రెండు వాహనాల్లో గంజాయి ప‌ట్టుబ‌డింది.

చవాన్, రమేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లాల‌కు 400 కిలోల గంజాయిని ఏపీలోని మల్కనగిరి నుంచి తరలిస్తున్న‌ట్టుగా ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకోవ‌డంతో పాటు, వాహ‌నాల‌ను సీజ్ చేసి భ‌ద్రాచ‌లం స్టేష‌న్‌కు త‌ర‌లించారు. సమావేశంలో పట్టణ సీఐ కే.వినోద్ రెడ్డి, ఎస్ఐ మహేష్, సీఆర్పీఎఫ్ 141 బెటాలియ‌న్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ టీవీ సుందరం పాల్గొన్నారు.

Tags:    

Similar News