బంగారుపాలెంలో నలుగురు మృతి

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మొదటగా బైక్ ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత లారీని ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ నుజ్జునుజ్జయ్యింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నట్టు […]

Update: 2020-08-30 00:34 GMT

దిశ, వెబ్ డెస్క్: రోడ్డు ప్రమాదానికి గురై నలుగురు మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఏపీలో చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మొదటగా బైక్ ను ఢీకొట్టిన కారు ఆ తర్వాత లారీని ఢీకొట్టింది. దీంతో ఆ బైక్ నుజ్జునుజ్జయ్యింది.

మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు కర్ణాటక వాసులు ఉన్నట్టు తెలిసింది. కర్ణాటక నుంచి చిత్తూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.

Tags:    

Similar News