నువ్వు చెప్పేది నిజమైతే.. ఈ వీడియో ఎక్కడిది?
దిశ, ఫీచర్స్ : మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో.. చాలా మంది మానసికంగా, శారీరకంగా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో గుప్పెడంత గుండె ధైర్యం, చిన్నపాటి చిట్కాలు మనల్ని స్ట్రాంగ్‌గా ఉంచడంలో సాయపడతాయి. ఈ నేపథ్యంలోనే నటుడు, ఫిట్‌నెస్ కోచ్ మిలింద్ సోమన్ ‘స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ ఎలా ఎదుర్కోవాలో వివరించాడు. ఇటీవలే COVID 19 నుంచి కోలుకున్న సోమన్.. తన ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌లో భాగంగా వారానికి ఒకసారి గాడ్జెట్ రహితంగా ఉండటం మైండ్‌కు రిఫ్రెష్‌మెంట్ […]
దిశ, ఫీచర్స్ : మహమ్మారి విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో.. చాలా మంది మానసికంగా, శారీరకంగా విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో గుప్పెడంత గుండె ధైర్యం, చిన్నపాటి చిట్కాలు మనల్ని స్ట్రాంగ్‌గా ఉంచడంలో సాయపడతాయి. ఈ నేపథ్యంలోనే నటుడు, ఫిట్‌నెస్ కోచ్ మిలింద్ సోమన్ ‘స్ట్రెస్ మేనేజ్‌మెంట్’ ఎలా ఎదుర్కోవాలో వివరించాడు.
ఇటీవలే COVID 19 నుంచి కోలుకున్న సోమన్.. తన ఫిట్‌నెస్ యాక్టివిటీస్‌లో భాగంగా వారానికి ఒకసారి గాడ్జెట్ రహితంగా ఉండటం మైండ్‌కు రిఫ్రెష్‌మెంట్ ఇచ్చిందని తన స్వీయ అనుభవాన్ని వెల్లడించాడు. ‘ఇకపై ఆదివారం ‘నో ఫోన్ డే’గా జరుపుకుందాం. ఎటువంటి గ్యాడ్జెట్లు లేకుండా 36 గంటల పాటు ఉంటే చాలు స్ట్రెస్ ఫ్రీ అయిపోతాం. అందుకే రోగనిరోధక శక్తిని బలహీనపరిచే అనవసరపు ఒత్తిడికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి’ అని మిలింద్ సూచించాడు.
అయితే 36 గంటలపాటు గ్యాడ్జెట్ లేకుండా ఉన్నానని చెప్పిన మిలింద్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ‘నువ్వు చెప్పేది నిజమైతే.. ఈ వీడియోను ఎలా తీశావంటూ?’ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ‘నువ్వు ఇచ్చే సోషల్ మెసేజ్ మాకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు గానీ.. నీ లుక్స్ మాత్రం ప్రమోట్ చేసుకుంటున్నావ్’ అని చురకలంటిస్తున్నారు.