త్వరలో 3,524 ఎస్జీటీ పోస్టులు భర్తీ

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సురేష్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 24న సర్టిఫికేట్ల పరిశీలన, 26న నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలో 2020డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఎస్సీలకూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. టెట్‌ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. ఇంటర్‌ విద్యలో సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ విద్యా విధానంలో […]

Update: 2020-09-22 09:32 GMT
త్వరలో 3,524 ఎస్జీటీ పోస్టులు భర్తీ
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: రాష్ర్టంలో ఖాళీగా ఉన్న 3,524 ఎస్జీటీ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి సురేష్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈనెల 24న సర్టిఫికేట్ల పరిశీలన, 26న నియామక ఉత్తర్వులు ఇస్తామన్నారు. త్వరలో 2020డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న డీఎస్సీలకూ త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. టెట్‌ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. ఇంటర్‌ విద్యలో సిలబస్ కుదించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. జాతీయ విద్యా విధానంలో ఏపీ ఇప్పటికే ముందున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

Tags:    

Similar News