చాక్లెట్ ఆశ చూపి చిన్నారిని లోనికి తీసుకెళ్లిన కామాంధుడు.. భయంతో పరుగులు తీయడంతో..!
దిశ, చార్మినార్ : చాక్లెట్ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్‌పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది.ఇన్‌స్సెక్టర్ సయ్యద్అబ్దుల్ ఖాదర్జిలానీ కథనం ప్రకారం.. అశోక్నరగ్కు చెందిన నర్సింగ్‌రావు(32) పీకల దాకా మద్యం సేవించాడు. ఉప్పుగూడ క్రాంతి నగర్లో తన ఇంటి ముందు ఒంటరిగా అడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిపై కామాంధుడి కన్నుపడింది. చాక్లెట్ఇప్పిస్తానని ఆశ పెట్టి పక్కకు తీసుకువెళ్లి […]
దిశ, చార్మినార్ : చాక్లెట్ఆశ చూపి నాలుగేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు అదుపులోకి తీసుకుని దేహశుద్ది చేశారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్‌పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది.ఇన్‌స్సెక్టర్ సయ్యద్అబ్దుల్ ఖాదర్జిలానీ కథనం ప్రకారం.. అశోక్నరగ్కు చెందిన నర్సింగ్‌రావు(32) పీకల దాకా మద్యం సేవించాడు.
ఉప్పుగూడ క్రాంతి నగర్లో తన ఇంటి ముందు ఒంటరిగా అడుకుంటున్న 4 ఏళ్ల చిన్నారిపై కామాంధుడి కన్నుపడింది. చాక్లెట్ఇప్పిస్తానని ఆశ పెట్టి పక్కకు తీసుకువెళ్లి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాలిక భయపడి పరుగులు తీస్తూ వెళ్ళి కుటుంబ సభ్యులకు చెప్పింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించిన నర్సింగ్రావును స్థానికుల సాయంతో పట్టుకుని కుటుంబ సభ్యలు దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత ఛత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.