కొత్తగా 3 కేసులు.. తెలంగాణలో 30 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. సోమవారం మధ్యాహ్నం వరకు కొత్తగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. కొత్త కేసుల్లో ఇద్దరు హైదరాబాద్ జిల్లాకు చెందిన వారు. వీరు విదేశాల నుంచి వచ్చిన వారు. మరో వ్యక్తి స్వస్థలం కరీంనగర్‌. ఈయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మందితో ఈయన సన్నిహితంగా మెలగడంతో కరోనా సోకింది. ప్రస్తుతం వైరస్ […]

Update: 2020-03-23 01:55 GMT
కొత్తగా 3 కేసులు.. తెలంగాణలో 30 మందికి కరోనా
  • whatsapp icon

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. సోమవారం మధ్యాహ్నం వరకు కొత్తగా మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 30కి చేరింది. కొత్త కేసుల్లో ఇద్దరు హైదరాబాద్ జిల్లాకు చెందిన వారు. వీరు విదేశాల నుంచి వచ్చిన వారు. మరో వ్యక్తి స్వస్థలం కరీంనగర్‌. ఈయనకు ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన ఎనిమిది మందితో ఈయన సన్నిహితంగా మెలగడంతో కరోనా సోకింది. ప్రస్తుతం వైరస్ బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నెల 31 వరకు లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags: corona virus, 3 new cases in telangana, total cases, raised to 30

Tags:    

Similar News