శానిటైజర్ తాగి మరో ముగ్గురు మృతి
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు చెన్నకేశవు, ఓబులేసు, భీమారెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు […]
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా పెండ్లిమర్రికి చెందిన ముగ్గురు మృత్యువాతపడ్డారు. దీంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రిలో శానిటైజర్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతులు చెన్నకేశవు, ఓబులేసు, భీమారెడ్డిగా గుర్తించినట్లు తెలిసింది. కాగా, ఇప్పటికే ప్రకాశం జిల్లా కురిచేడులో శానిటైజర్ తాగి పలువురు మృతిచెందిన విషయం తెలిసిందే.