నిరాడంబరంగా తిరుమల వసంతోత్సవాలు

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఏటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై ఛైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేలా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ ఉత్సవాల కోసం తిరుమల శ్రీవారి ఆలయం వెనుక భాగంలోని వసంత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దేవేరులతో కూడి సుగంధ ద్రవ్యాలతో వసంతాలాడుతూ, శ్రీదేవి […]

Update: 2020-04-05 02:45 GMT

తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఈ ఏడాది కరోనా కారణంగా నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఏటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై ఛైత్ర శుద్ధ పౌర్ణమికి ముగిసేలా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.

ఈ ఉత్సవాల కోసం తిరుమల శ్రీవారి ఆలయం వెనుక భాగంలోని వసంత మండపాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతారు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో దేవేరులతో కూడి సుగంధ ద్రవ్యాలతో వసంతాలాడుతూ, శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి (వెంకటేశ్వర స్వామి) కి ఆలయంలోని కళ్యాణ మండపంలో అభిషేకాలు నిర్వహిస్తారు. ఆలయానికి బంగారు శ్రీ పీఠంలో బయలుదేరి, ప్రదక్షిణంగా పురవీధుల్లో, ఛత్రచామర మర్యాదలతో, వేద-దివ్య ప్రబంధ పారాయణాలతో, బాజాభజంత్రీలతో ఊరేగుతూ వసంత మండపానికి బయలుదేరుతారు. మండపానికి వచ్చాక దేవేరులతో కూడిన స్వామికి స్నానం చేయించి, శుద్ధజలం, ఆవుపాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకిస్తారు. ధూప దీప నివేదన, కర్పూర హారతులు జరుగుతాయి. చివరగా చందనాన్ని ఆ ముగ్గురికి చక్కగా అద్ది, శ్రీ తిలకాన్ని తీర్చిదిద్దుతారు.

తులసి మాలల్ని అలంకరిస్తారు. కుంభహారతి, నక్షత్ర హారతి సమర్పించిన తరువాత.. కలశంలోని మంత్రజలంతో, బంగారు పళ్లెంతో సహస్ర ధారాభిషేకం జరుగుతుంది. వారిని తుడిచి పట్టు వస్త్రాలు, సర్వాభరణాలతో, పుష్పహారాలతో అలంకరించి, సాయంత్రం బయలుదేరి, ఊరేగుతూ ఆలయానికి తిరిగి తీసుకువెళ్తారు. ఆ సహస్రధారాభిషేక తీర్థాన్ని, భక్తులు పవిత్రులు కావాలనే భావంతో వారిపై సంప్రోక్షిస్తారు. స్వామికి అద్దిన పసుపు, చందనాన్ని ప్రసాదంగా పంచుతారు. మూడవనాడు దేవేరులతో కూడిన స్వామితో పాటు, సీతారామలక్ష్మణ హనుమంతులు, రుక్మిణీ-శ్రీకృష్ణులు కూడా వసంతోత్సవంలో పాల్గొంటారని ప్రతీతి. ముగ్గురినీ ప్రత్యేక బంగారు పీఠాల్లోనే ఊరేగిస్తూ తీసుకువచ్చి, ముగ్గురికీ విడివిడిగానే అభిషేక నైవేద్యాదులు సమర్పిస్తారు. త్రేతాయుగం నాటి రాముణ్నీ, ద్వాపర యుగం నాటి కృష్ణుణ్నీ నేనే అనే భావాన్ని వేంకటేశ్వరస్వామి ప్రకటిస్తున్నాడని ఈ ఉత్సవాల ద్వారా చాటి చెబుతారు. అయితే…

కరోనా కారణంగా ప్రతి ఏటా నిర్వహించే వసంతోత్సవాల్లోని వివిధ కార్యక్రమాలను టీటీడీ రద్దు చేసింది. ఈ ఏడు రధోత్సవం నిర్వహించడం లేదు. దాని స్థానంలో సర్వ భూపాల వాహనంలో ఉత్సవర్లను కొలువుదీర్చి మండపంలోనే విశేష సమార్పన నిర్వహించనున్నారు. నేటి సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు. తొలి రెండు రోజులు మలయప్పస్వామి, దేవేరులు మాత్రమే వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజున మూడు యుగాలను గుర్త్తుచేస్తూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామికి ఏకకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. దాంతో పవిత్సోత్సవాలు ముగుస్తాయని టీటీడీ ప్రకటించింది.

Tags: TTD, Tirumala, Vasanthotsavam, Corona effect, 3 Day Festival

Tags:    

Similar News