ట్రాన్స్ కో ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్(టీఎస్ ట్రాన్స్ కో) ఉద్యోగులకు డీఏ పెరిగింది. ప్రస్తుతమున్న దాని కన్నా 3 శాతానికిపైగా డీఏ పెంచుతూ ట్రాన్స్ కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి తాజా పెంపు వర్తిస్తుందని తెలిపారు. గతంలో జీతంలో 13శాతంగా ఉన్న డీఏ ప్రస్తుత పెంపుతో 16 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు […]

Update: 2020-08-14 06:56 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్ మిషన్ కార్పొరేషన్(టీఎస్ ట్రాన్స్ కో) ఉద్యోగులకు డీఏ పెరిగింది. ప్రస్తుతమున్న దాని కన్నా 3 శాతానికిపైగా డీఏ పెంచుతూ ట్రాన్స్ కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి తాజా పెంపు వర్తిస్తుందని తెలిపారు. గతంలో జీతంలో 13శాతంగా ఉన్న డీఏ ప్రస్తుత పెంపుతో 16 శాతానికి చేరింది. దీంతో ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పెరిగిన డీఏను సెప్టెంబర్‌లో ఇచ్చే ఆగస్టు నెల జీతంతో పాటు చెల్లించడం ప్రారంభిస్తామని తెలిపారు. జూలై నెలలో రావాల్సిన పెరిగిన డీఏను ఆగస్టు నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లిస్తామని వెల్లడించారు.

Tags:    

Similar News