స్వచ్ఛమైన ‘నీరా’ కోసం 3.75 కోట్ల మొక్కలు నాటినం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరా (కల్లు)ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3.75 కోట్ల ఈత, తాటి, డైమండ్ మొక్కలను నాటినట్లు రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మూడు వేల మొక్కలను మంత్రి నాటారు. తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలు […]

Update: 2021-07-20 06:15 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన నీరా (కల్లు)ను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 3.75 కోట్ల ఈత, తాటి, డైమండ్ మొక్కలను నాటినట్లు రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. మంగళవారం భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హరితహారం కార్యక్రమంలో భాగంగా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి మూడు వేల మొక్కలను మంత్రి నాటారు.

తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహించేందుకు తీసుకున్న చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయని ఆయన చెప్పారు. గీత కార్మికులను ఆదుకునేందుకు, ప్రజలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నీరాను అందించేందుకు వీలుగా ఈత, తాటి మొక్కలు నాటేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అన్ని వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించిందన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగునీటిని అందిస్తామని మంత్రి చెప్పారు. కరివేన ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాలను చేపడతామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సైదులు, డిప్యూటీ కమిషనర్ భక్త రాజ్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ బసవరాజు గౌడ్, ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, బాదేపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News