బాలకోట్‌లో 27మంది ఉగ్రవాదులకు శిక్షణ
గతేడాది ఫిబ్రవరిలో భారత వాయుసేన చేతిలో దాడికి గురైన బాలకోట్‌లోని జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. భారత్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నది. ఈ నేపథ్యంలో భారత్‌పై దాడి చేసేందుకు అదే బాలకోట్‌లో 27మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ అధికారులు రక్షణశాఖకు వెల్లడించారు. భారత వాయుసేనపై దాడి చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. […]
గతేడాది ఫిబ్రవరిలో భారత వాయుసేన చేతిలో దాడికి గురైన బాలకోట్‌లోని జైషేమహ్మద్ ఉగ్రవాద సంస్థ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. భారత్‌పై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకునేందుకు పన్నాగాలు పన్నుతున్నది. ఈ నేపథ్యంలో భారత్‌పై దాడి చేసేందుకు అదే బాలకోట్‌లో 27మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నది. ఈ విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ అధికారులు రక్షణశాఖకు వెల్లడించారు. భారత వాయుసేనపై దాడి చేయడమే లక్ష్యంగా ఈ శిక్షణ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు తెలిపారు. యూసుఫ్ అజార్ నాయకత్వంలో 27మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నారని వెల్లడించారు. వీరిలో ఎనిమిది మంది పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు చెందిన వారని తీవ్రవాద నిరోధక సంస్థ తెలిపింది. వీరు ఏ క్షణంలోనైనా భారత్‌లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించింది.