ఆదాయంలో సంపన్నులు.. పన్నులు మాత్రం చెల్లించరట

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా ఉన్నవాళ్లు ఆదాయ పన్ను చెల్లించడంలో మాత్రం పొదుపు మంత్రం జపిస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ ప్రొపబ్లికా తన కథనంలో వెల్లడించింది. గడిచిన 15 ఏల్ల కాలంలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా వివరాలను సేకరించి ప్రొపబ్లికా సంస్థ ఈ వివరాలను తెలిపింది. అత్యంత సంపన్నులైన 25 మంది ఆదాయ పన్ను వివరాలను వెల్లడించిన ఈ కథనంలో సమీక్షించిన కాలానికి వారి సంపద పెరుగుదలకు, పన్ను చెల్లింపునకు చాలా వ్యత్యాసం ఉందని […]

Update: 2021-06-09 09:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అత్యంత సంపన్నులుగా ఉన్నవాళ్లు ఆదాయ పన్ను చెల్లించడంలో మాత్రం పొదుపు మంత్రం జపిస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ ప్రొపబ్లికా తన కథనంలో వెల్లడించింది. గడిచిన 15 ఏల్ల కాలంలో ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ డేటా వివరాలను సేకరించి ప్రొపబ్లికా సంస్థ ఈ వివరాలను తెలిపింది. అత్యంత సంపన్నులైన 25 మంది ఆదాయ పన్ను వివరాలను వెల్లడించిన ఈ కథనంలో సమీక్షించిన కాలానికి వారి సంపద పెరుగుదలకు, పన్ను చెల్లింపునకు చాలా వ్యత్యాసం ఉందని తేలింది. ఈ జాబితాలో వారెన్ బఫెట్, జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ కూడా ఉన్నారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 2007, 2011లో పన్ను అసలు చెల్లించలేదని, ఎలన్ మస్క్ సైతం 2018లో కొంత కూడా చెల్లించలేదని పత్రిక పేర్కొంది.

ఈ కథనం ద్వారా అమెరికా పన్నుల వ్యవ్స్థ బలహీనంగ ఉన్నట్టు తేలిందని సంస్థ అభిప్రాయపడింది. అయితే, అధికారికంగా ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించకపోవడం గమనార్హం. కానీ పన్నుల వివరాలు బయటకు రావడం చట్ట వ్యతిరేకమని, దీనిపై విచారణ ఉంటుందని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ఈ జాబితాలో బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ కూడా ఉన్నట్టు ప్రొపబ్లికా వివరించింది. అమెరికాలో 6 లక్షల డాలర్లకు పైగా సంపాదిస్తున్న వారు గరిష్ఠంగా 37 శాతం ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. అయితే, అత్యంత సంపన్నులు మాత్రం పన్నులను ఎగవేస్తున్నారు. వీరు పన్ను వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో తర్వాతి కథనాల్లో వెల్లడించనున్నట్టు ప్రొపబ్లికా తెలిపింది.

Tags:    

Similar News