దేశంలో 2,34,692 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. గత మూడు రోజులుగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మొదలైన తర్వాత ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,45,26,609 కు చేరింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. గత మూడు రోజులుగా 2 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశంలో రికార్డు స్థాయిలో 2,34,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మొదలైన తర్వాత ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,45,26,609 కు చేరింది. దేశంలో కరోనా మరణాల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1341 మంది కరోనా బారిన పడి మరణించారు. దేశంలో ఇప్పటి వరకు ఒక్క రోజులో ఇన్ని కరోనా మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. దీంతో కరోనా మరణాల సంఖ్య 1,75,649కు చేరింది. తాజాగా దేశంలో 1679740 యాక్టివ్ కేసులు ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 123,354 మంది డిశ్చార్జ్ అయ్యారు.