శుక్రవారం మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి
దిశ,వెబ్‌డెస్క్: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండిధరలు దూసుకుపోతున్నాయి. కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాల అధినేతలు తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలతో పాటు అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో డబ్ల్యూహెచ్ ఓ కు నిధుల కేటాయింపు తో పాటు ముస్లీం దేశాల రాకపోకలపై నిషేదం ఎత్తివేస్తూ సంతకాలు చేయడంతో మార్కెట్ పుంజుకుంది. దీంతో మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పోటీపడుతున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ ప్రకారం తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ […]
దిశ,వెబ్‌డెస్క్: జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండిధరలు దూసుకుపోతున్నాయి. కరోనా మహమ్మారిపై ప్రపంచ దేశాల అధినేతలు తీసుకుంటున్న సానుకూల నిర్ణయాలతో పాటు అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడంతో డబ్ల్యూహెచ్ ఓ కు నిధుల కేటాయింపు తో పాటు ముస్లీం దేశాల రాకపోకలపై నిషేదం ఎత్తివేస్తూ సంతకాలు చేయడంతో మార్కెట్ పుంజుకుంది. దీంతో మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పోటీపడుతున్నాయి. ఇక ప్రస్తుతం మార్కెట్ ప్రకారం తెలుగు రాష్ట్రాలతోపాటు జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
శుక్రవారం (22-01-21) రోజు హైదరాబాద్ లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.450కి పెరిగి రూ.46,250కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490కి పెరిగింది. దీంతో రూ. 50,450కి చేరుకుంది.
విజయవాడ, వైజాగ్‌లలో బంగారం ధర 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 450కి పెరిగి రూ.46,250కి చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి రూ. 50,450కి చేరుకుంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగింది రూ.48,400కి చేరుకుంది. అదే విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగింది రూ. 52,800కు చేరుకుంది.
ఇక వెండి ధరల విషయానికి వస్తే.. శుక్రవారానికి రూ. 1200 పెరిగి కేజీ వెండి ధర రూ. 67,700 చేరుకుంది.