ఆమెకు 41, అతడికి 21.. ఆంటీ ఇంట్లో కుర్రాడిని చూసి..
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ గుడ్డిది అంటారు కదా.. అలాంటి ఘటనే ఒకటి తాజాగా సంచలనంగా మారింది. 41ఏళ్ల మహిళ, 21ఏళ్ల యువకుడి ప్రేమాయణం బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఖగడియా జిల్లా పంచ్కుటీ మండలం దరియాపుర్ పంచాయతీ పరిధిలోని నయాగావ్‌కు చెందిన మనతి దేవి(41)కి జోరావర్పూర్కు చెందిన రవి కుమార్(21)తో పరిచయం ఏర్పడింది. అయితే, మనతి దేవీ భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా ఆమెకు నలుగురు పిల్లలున్నారు. ఈ పరిచయం […]
దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ గుడ్డిది అంటారు కదా.. అలాంటి ఘటనే ఒకటి తాజాగా సంచలనంగా మారింది. 41ఏళ్ల మహిళ, 21ఏళ్ల యువకుడి ప్రేమాయణం బీహార్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. బీహార్‌లోని ఖగడియా జిల్లా పంచ్కుటీ మండలం దరియాపుర్ పంచాయతీ పరిధిలోని నయాగావ్‌కు చెందిన మనతి దేవి(41)కి జోరావర్పూర్కు చెందిన రవి కుమార్(21)తో పరిచయం ఏర్పడింది.
అయితే, మనతి దేవీ భర్త కొన్నేళ్ల క్రితమే మృతి చెందగా ఆమెకు నలుగురు పిల్లలున్నారు. ఈ పరిచయం కాస్తా వారిద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. దీంతో వారిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రవికుమార్.. మనతి దేవి ఇంటికి తరచుగా వెళ్తు ఉండేవాడు. అయితే ఆగస్టు 16న సాయంత్రం.. రవికుమార్.. మనతి ఇంట్లో ఉండటం గ్రామస్థుల కంట పడింది.
దీంతో వారు రవికుమార్‌ను పట్టుకుని అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో దరియాపూర్ సర్పంచ్ శంబు సింగ్, జోరావర్పూర్ సర్పంచ్ పంకజ్ షా.. మనతి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఇద్దరు సర్పంచ్ల ఆధ్వర్యంలో గ్రామస్థులు, కుటుంబసభ్యులు కలిసి వారిని నిలదీశారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నట్టు తెలిపారు. తాము వివాహం చేసుకుంటామని తెలపడంతో ఊరి పెద్దలు వారికి వివాహం చేశారు.
ఈ నేపథ్యంలోనే మొత్తం నలుగురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను కొత్త జంట వద్ద, మరో ఇద్దరిని మనతి తల్లి వద్ద ఉంచేలా పెద్దలు అంగీకారం కుదిర్చారు. వివాహం జరిగిన తర్వాత గ్రామస్తులు రవికుమార్ వెంట మనతిని పంపించారు. ఈ విషయంతో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Read more
బయటపడిన 250 నగ్న వీడియోలు.. అందులో 100 బాలీవుడ్ తారలవే.