IND vs PAK : జోరుమీదున్న హిట్‌మ్యాన్.. గెలుపు లాంఛనమే

ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు అహ్మదాబాద్ స్టేడియంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడుతున్నాయి.

Update: 2023-10-14 13:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్, పాకిస్థాన్ జట్లు అహ్మదాబాద్ స్టేడియంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడుతున్నాయి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 192 పరుగు విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. 23 పరుగుల వద్ద షాహిన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో గిల్ (11 బంతులో 16 పరుగులు) చేసి క్యాచ్ అవుట్‌ అయ్యాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ, రోహిత్‌తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. ముఖ్యంగా రోహిత్ పాక్ బౌలర్లను బేజారెత్తేలా చేశాడు. ఓవర్‌‌కు ఒక సిక్స్ కొడుతూ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. అదేవిధంగా తొమ్మిదో ఓవర్‌లో హసన్ అలీ వేసిన బంతిని కోహ్లీ మిడాన్ మీదుగా ఆడగా మహమ్మద్ నవాజ్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 47 పరుగులు), శ్రేయాస్ అయ్యార్ (12 బంతుల్లో 11 పరుగుల)తో క్రీజ్‌లో ఉన్నారు.      

Tags:    

Similar News