రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి సరికొత్త హిమాలయన్ 2021

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటార్‌ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 ఏడాది ఎన్‌ఫీల్డ్ హిమాలయాన్‌ను గురువారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోటార్‌ సైకిల్ ప్రారంభ ధర రూ. 2.01 లక్షలు(ఎక్స్‌షోరూమ్-చెన్నై)తో లభిస్తుందని కంపెనీ తెలిపింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బైకును అప్‌డేట్ చేశామని, యూకే మార్కెట్లో సైతం అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా అనేక కొత్త అప్‌డేట్‌లతో పాటు మూడు కొత్త రంగుల్లో పైన్ గ్రీన్, మిరాజ్ సిల్వర్, గ్రానైట్ […]

Update: 2021-02-11 07:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ మోటార్‌ సైకిల్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ 2021 ఏడాది ఎన్‌ఫీల్డ్ హిమాలయాన్‌ను గురువారం దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మోటార్‌ సైకిల్ ప్రారంభ ధర రూ. 2.01 లక్షలు(ఎక్స్‌షోరూమ్-చెన్నై)తో లభిస్తుందని కంపెనీ తెలిపింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ బైకును అప్‌డేట్ చేశామని, యూకే మార్కెట్లో సైతం అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా అనేక కొత్త అప్‌డేట్‌లతో పాటు మూడు కొత్త రంగుల్లో పైన్ గ్రీన్, మిరాజ్ సిల్వర్, గ్రానైట్ బ్లాక్‌లలో లభిస్తుందని తెలిపింది.

అలాగే, రాయల్ ఎన్‌ఫీల్డ్ యాప్‌ను ఉపయోగించి రైడర్ స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకునేలా టర్న్-బై-టర్న్ నావిగేషన్ ప్యాడ్ ఈ బైకులో ఉంటుంది. అదేవిధంగా 2021 కొత్త ఎన్‌ఫీల్డ్ హిమాలయన్‌లో కొత్త విండ్‌స్క్రీన్, కొత్త ఫ్రంట్ ర్యాక్, బ్యాక్ క్యారియర్‌పై అదనపు ప్లేట్ ఉంటాయని కంపెనీ పేర్కొంది. సరికొత్త ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ రంగులను బట్టి ధరల మధ్య వ్యత్యాసం ఉంది. మిరాజ్ సిల్వర్, గ్రావెల్ గ్రే ధర రూ. 2,36,286 ఉండగా, లేక్ బ్లూ, గ్రానైట్ బ్లాక్, రాక్ రెడ్‌ల ధర రూ. 2,40,285, పైన్ గ్రీన్ ధర రూ. 2,44,284 గా ఉంది.

Tags:    

Similar News