ఎస్‌బీఐ ముద్ర రుణాల్లో 20 శాతం ఎన్‌పీఏలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం కింద తీసుకున్న రుణాల్లో దాదాపు 20 శాతం ఎన్‌పీఏలుగా ఉన్నట్టు తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రంగ బ్యాంకులు ఇచ్చిన ముద్ర రుణాల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఎస్‌బీఐ ముద్ర రుణాల కింద 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 30 వేల కోట్ల రుణాలివ్వగా, ఇందులో సుమారు రూ. 5,800 కోట్ల […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) నుంచి ప్రధాన మంత్రి ముద్ర యోజన(పీఎంఎంవై) పథకం కింద తీసుకున్న రుణాల్లో దాదాపు 20 శాతం ఎన్‌పీఏలుగా ఉన్నట్టు తెలుస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రంగ బ్యాంకులు ఇచ్చిన ముద్ర రుణాల గణాంకాలను ప్రభుత్వం వెల్లడించింది. ఎస్‌బీఐ ముద్ర రుణాల కింద 2019-20 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ. 30 వేల కోట్ల రుణాలివ్వగా, ఇందులో సుమారు రూ. 5,800 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ)లు ఉన్నాయి. చిన్న పారిశ్రామిక వేత్తలకు మద్ధతుగా వారికి రూ.10 లక్షల వరకు రుణాలిచ్చేందుకు ఐదేళ్ల క్రితం కేంద్ర ముద్ర రుణ పథకాన్ని ప్రారంభించింది. ఈ రుణాలను తీసుకున్న వారిలో ముఖ్యంగా మొబైల్ రిపేర్ వ్యాపారులు, బ్యూటీ పార్లర్ లాంటి చిన్న చిన్న వ్యాపారులున్నారు. పీఎంఎంవై కింద ప్రభుత్వ రంగ బ్యాంకులు మొత్తం రూ.3.92 లక్షల కోట్ల రుణాలను ఇవ్వగా, ఇందులో రూ. 18,836 కోట్లు ఎన్‌పీఏలుగా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.