లక్ష మట్టి గణపతి ప్రతిమల పంపిణీ..

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే గణేశ్ నవరాత్రులు సమీపిస్తుండటంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కొర్పొరేష‌న్ ప‌రిధిలో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప్రకటించారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు వివరించారు. ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ఈ ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సంతోష్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మున్సిప‌ల్ కార్పొరేట‌ర్ల‌కు మంత్రి బుధ‌వారం మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను […]

Update: 2020-08-19 12:00 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే గణేశ్ నవరాత్రులు సమీపిస్తుండటంతో గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కొర్పొరేష‌న్ ప‌రిధిలో ల‌క్ష గ‌ణేష్ మ‌ట్టి విగ్ర‌హాల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ ప్రకటించారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌లో భాగంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు వివరించారు. ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్ కుమార్ ఈ ప్ర‌తిమ‌ల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. సంతోష్‌న‌గ‌ర్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మున్సిప‌ల్ కార్పొరేట‌ర్ల‌కు మంత్రి బుధ‌వారం మ‌ట్టి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను అందజేశారు.

కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా.. ప్ర‌జ‌లు తమ ఇళ్ల‌లోనే పండుగ‌ను జరుపుకోవాల్సిందిగా మంత్రి కోరారు. 11వ రోజు నిమజ్జన ఉత్స‌వాన్ని సాంప్ర‌దాయం ప్ర‌కారం గ‌ణేష్ ఆల‌యాల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఏడాది ప్ర‌భుత్వ‌మే బోనాలు, వినాయ‌క చ‌వితిని ఘ‌నంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు మంత్రి తలసాని వెల్లడించారు.

Tags:    

Similar News