ఘోర ప్రమాదం.. ఇన్నోవా ఢీకొని 18 గొర్రెలు మృతి

దిశ, జమ్మికుంట : వీణవంక మండలం కోర్కల్ గ్రామ శివారులో ఇన్నోవా వాహనం ఢీకొని 18 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ నుంచి జమ్మికుంట వైపునకు వస్తున్న ఇన్నోవా వాహనం కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిలోని కోర్కల్ గ్రామానికి చెందిన కంప రాములు, అమ్మ రాజమ్మ, కంప సంతు, కంప కుమారులకు చెందిన గొర్రెల మందలు ఇంటికి వెళ్తుండగా.. ఇన్నోవా వాహనం ఢీకొట్టడంతో 18 గొర్రెలు […]

Update: 2021-09-01 10:59 GMT

దిశ, జమ్మికుంట : వీణవంక మండలం కోర్కల్ గ్రామ శివారులో ఇన్నోవా వాహనం ఢీకొని 18 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ప్రమాదంపై బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కరీంనగర్ నుంచి జమ్మికుంట వైపునకు వస్తున్న ఇన్నోవా వాహనం కరీంనగర్-జమ్మికుంట ప్రధాన రహదారిలోని కోర్కల్ గ్రామానికి చెందిన కంప రాములు, అమ్మ రాజమ్మ, కంప సంతు, కంప కుమారులకు చెందిన గొర్రెల మందలు ఇంటికి వెళ్తుండగా.. ఇన్నోవా వాహనం ఢీకొట్టడంతో 18 గొర్రెలు మృతి చెందగా, 12 గొర్రెలు గాయపడ్డాయి. విషయం తెలుసుకున్న వీణవంక ఎస్ఐ కిరణ్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.

 

Tags:    

Similar News