1,600 మంది జర్నలిస్టులకు కొవిడ్ సాయం
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా బారిన పడిన 1,603మంది జర్నలిస్టులకు రూ.3.12కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్ సమాచార భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1,517మందికి కరోనా పాజిటివ్ వస్తే ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున రూ.3కోట్ల 3లక్షల 40వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత హోంక్వారంటైన్‌లో ఉన్న 86మంది జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున రూ.8లక్షల 60వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 1,603మంది […]
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా బారిన పడిన 1,603మంది జర్నలిస్టులకు రూ.3.12కోట్ల ఆర్థిక సాయం అందించినట్లు మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. శుక్రవారం మాసబ్‌ట్యాంక్ సమాచార భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 1,517మందికి కరోనా పాజిటివ్ వస్తే ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున రూ.3కోట్ల 3లక్షల 40వేలు, దీనితోపాటు ప్రైమరీ కాంటాక్ట్ చేత హోంక్వారంటైన్‌లో ఉన్న 86మంది జర్నలిస్టులకు రూ.10వేల చొప్పున రూ.8లక్షల 60వేల ఆర్థిక సాయం అందించినట్లు పేర్కొన్నారు. మొత్తంగా 1,603మంది జర్నలిస్టులకు సంక్షేమ నిధి నుండి రూ.3.12కోట్ల ఆర్థికసాయం చేశామని వెల్లడించారు.
కరోనా సోకిన జర్నలిస్టులు అక్రిడేషన్ లేదా గుర్తింపు కార్డు, పాజిటివ్ ధృవీకరణ పత్రము, బ్యాంకు వివరాలను అకాడమీ కార్యాలయానికి పంపిన వెంటనే ఖాతాలో డబ్బులు జమ చేసినట్టు వివరించారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి రూ.100కోట్ల గ్రాంట్ ఇవ్వాలనే నిర్ణయం మనకు రక్షణ కవచంలా నిలిచిందన్నారు. వీటిలో ఇప్పటికే రూ.34.50 కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నారు. ఈ నిధిపై వచ్చే వడ్డీ ద్వారా జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కొవిడ్ బారిన పడిన జర్నలిస్ట్‌లు తమ వివరాలను మీడియా అకాడమీ ఛైర్మన్ వాట్సప్ నెంబర్ 80966 77444కి పంపాలన్నారు. మరిన్ని వివరాలకు మేనేజర్ లక్ష్మణ్ కుమార్ నెంబరు 96766 47807కు సంప్రదించాలని తెలిపారు.