మెడికల్ కాలేజీలకు 16.76 కోట్లు విడుదల

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడత 16.76 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధులను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న 7 కాలేజీల నిర్మాణల కొరకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు కల్పించే నేషనల్ మెడికల్ కమిషన్ విజిట్ కూడా ఈ నెలాఖరుకు ఉండటంతో.. అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు […]

Update: 2021-09-20 05:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాట్లను ప్రభుత్వం వేగవంతం చేసింది. తొలి విడత 16.76 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ రిజ్వీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ నిధులను కొత్తగా అందుబాటులోకి తీసుకువస్తున్న 7 కాలేజీల నిర్మాణల కొరకు వినియోగించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతులు కల్పించే నేషనల్ మెడికల్ కమిషన్ విజిట్ కూడా ఈ నెలాఖరుకు ఉండటంతో.. అధికారులు హుటాహుటిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌ఎంసీ వచ్చే లోపల కాలేజీ నిర్మాణాలు పూర్తి కాకపోతే ఆ కమిటీ రిమార్కులు ఇచ్చే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ లోని ఉన్నతాధికారి తెలిపారు

Tags:    

Similar News