కరోనాతో ఒకశాతమే చనిపోతున్నారు

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా బాధితుల్లో ఒకశాతం మాత్రమే చనిపోతున్నారని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. 85శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని మంగళవారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,718 యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 65.48శాతంగా ఉందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత జనసంచారం ఎక్కువ కావడంతో పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి హోమ్ ఐసోలేషన్ సదుపాయం లేకుంటే ప్రభుత్వం ఐసోలేషన్లలో […]

Update: 2020-07-14 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కరోనా బాధితుల్లో ఒకశాతం మాత్రమే చనిపోతున్నారని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. 85శాతం మందిలో కరోనా లక్షణాలు కనిపించడం లేదని మంగళవారం ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 12,718 యాక్టివ్ కేసులు ఉన్నాయని, రికవరీ రేటు 65.48శాతంగా ఉందన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత జనసంచారం ఎక్కువ కావడంతో పాజిటివ్ కేసులు బాగా పెరుగుతున్నాయని తెలిపారు. కరోనా పాజిటివ్‌గా తేలిన వారికి హోమ్ ఐసోలేషన్ సదుపాయం లేకుంటే ప్రభుత్వం ఐసోలేషన్లలో చికిత్స అందిస్తుందని పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని టిమ్స్‌లో కూడా సోమవారం నుంచి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారని, జీహెచ్ఎంసీలో 98ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతులు ఉన్నాయన్నారు.

Tags:    

Similar News