రూ.25వేల లోపు రుణమాఫీకి రూ.1210కోట్లు విడుదల
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో రుణమాఫీ మొదటి దశ నిధులు విడుదలయ్యాయి. రూ.25వేల లోపు రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయడానికిగాను ప్రభుత్వం రూ.1210 కోట్లు రిలీజ్ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ మార్చి ముగిసే లోపు రూ.25వేల లోపు రుణాల మాఫీకి నిధులు విడుదల […]
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో రుణమాఫీ మొదటి దశ నిధులు విడుదలయ్యాయి. రూ.25వేల లోపు రుణాలు ఈ ఆర్థిక సంవత్సరంలో మాఫీ చేయడానికిగాను ప్రభుత్వం రూ.1210 కోట్లు రిలీజ్ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బి. జనార్ధన్ రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఈ మార్చి ముగిసే లోపు రూ.25వేల లోపు రుణాల మాఫీకి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మాఫీ నిధులను నేరుగా ఎమ్మెల్యేల ద్వారా చెక్కుల రూపంలో నియోజకవర్గాల్లో అందిస్తామని ఆర్థిక మంత్రి హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం రుణమాఫీకి ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.1210 కోట్లు విడుదల చేయగా రూ.4790 కోట్లు పెండింగ్‌లో పెట్టింది.
tags : loan waiver, telangana, agriculture department