హిందూ శరణార్థులు 11మంది ఆత్మహత్మ..

దిశ, వెబ్ డెస్క్ : ఒకే కుటుంబానికి చెందిన 12మంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డగా, అదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పుర్ లోహ్‌దాత గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే కుటుంబంలో అంత మంది ఒకేసారి సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాకుండా వీరి మరణం స్థానికంగా విషాదం నింపింది. వివరాల్లోకివెళితే.. పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కిందట రాజ‌స్థాన్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డార. […]

Update: 2020-08-09 04:42 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒకే కుటుంబానికి చెందిన 12మంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డగా, అదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పుర్ లోహ్‌దాత గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఒకే కుటుంబంలో అంత మంది ఒకేసారి సూసైడ్ చేసుకోవడం పలు అనుమానాలకు దారితీస్తోంది. అంతేకాకుండా వీరి మరణం స్థానికంగా విషాదం నింపింది.

వివరాల్లోకివెళితే.. పాకిస్తాన్‌లోని సింధూ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబం కొన్నేళ్ల కిందట రాజ‌స్థాన్‌కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డార. వీరిని హిందూ శ‌ర‌ణార్థులుగా గుర్తించారు. కుటుంబ స‌భ్యులు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ప్రాంతంలో పురుగుల మందు వాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతున్నారు.ఇన్నిరోజులు ఇరుగుపోరుగుతో బానే కలిసి ఉండేవారని.. సడన్‌గా కుటుంబంలోని వ్యక్తులంతా సామూహిక ఆత్మహత్యలకు పాల్పడటంతో స్థానికులు విచారం వ్యక్తంచేశారు.

మొత్తం 12 మంది పురుగుల మందు తాగి సామూహిక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డినట్లు తేలగా, ఇందులో 11 మంది మరణించారు. ఒక‌రు మాత్రం ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అతను పూర్తిగా కోలుకున్నతర్వాత ఈ ఘటనకు గల కారణాలు పూర్తిగా తెలిసే అవకాశం ఉన్నది. ఈ మేరకు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News