ఏపీలో 24 గంటల్లో 105 కరోనా కేసులు

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ, కంట్రోల్‌లోకి వస్తుందనుకున్న దశలో మరోసారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 10,567 శాంపిళ్లను పరీక్షించగా 105 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్యల 3,676కి చేరుకుందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, నిన్న కరోనా బారినపడి కోలుకుని 34 మంది […]

Update: 2020-06-01 05:48 GMT

దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తోంది. నాలుగు రోజుల క్రితం వరకు తక్కువ సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతూ, కంట్రోల్‌లోకి వస్తుందనుకున్న దశలో మరోసారి విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో 10,567 శాంపిళ్లను పరీక్షించగా 105 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.

దీంతో ఏపీలో కరోనా బాధితుల సంఖ్యల 3,676కి చేరుకుందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. కాగా, నిన్న కరోనా బారినపడి కోలుకుని 34 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. కరోనా కారణంగా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 885 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,169 మంది డిశ్చార్జ్ అయ్యారని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. ఏపీ కరోనా మృతుల సంఖ్య 68కి చేరుకుందని వెల్లడించింది.

Tags:    

Similar News