గణనాధుడికి 101 నైవేద్యాలు

దిశ, పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా జనగామ రోడ్‌లో వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేసిన గణనాధుడికి బుధవారం 101 రకాల నైవేద్యాలు సమర్పించారు. విఘ్నరాజ ఉత్సవకమిటీ మహిళా సభ్యులు ఐదు గంటలపాటు శ్రమించి 101 రకాల నైవేద్యాలు చేసి గణనాధుడి సేవలో తరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాధుడికి నైవేద్యాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గంగు దీపక్ శర్మ, కమిటీ గౌరవ […]

Update: 2021-09-15 04:28 GMT
గణనాధుడికి 101 నైవేద్యాలు
  • whatsapp icon

దిశ, పాలకుర్తి: పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా జనగామ రోడ్‌లో వ్యాపార సంస్ధలు ఏర్పాటు చేసిన గణనాధుడికి బుధవారం 101 రకాల నైవేద్యాలు సమర్పించారు. విఘ్నరాజ ఉత్సవకమిటీ మహిళా సభ్యులు ఐదు గంటలపాటు శ్రమించి 101 రకాల నైవేద్యాలు చేసి గణనాధుడి సేవలో తరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణ నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాధుడికి నైవేద్యాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు గంగు దీపక్ శర్మ, కమిటీ గౌరవ అధ్యక్షులు కాటబత్తిని సోమేశ్వర్, అధ్యక్షులు శ్రీపాద ఉప్పల చారి, కార్యదర్శి సమ్మయ్య,మహిళాలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News