అనంతపురంలో తీవ్ర విషాదం.. ఆక్సిజన్ అందక 10 మంది రోగులు మృతి

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ సేవ్ సమయంలో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులో లేక ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా అనంతరం జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు అందక కళ్ల ముందే తమ వారు చనిపోతుండటంతో […]

Update: 2021-05-01 21:19 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. గతంలో కంటే సెకండ్ సేవ్ సమయంలో రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే, రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులో లేక ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. తాజాగా అనంతరం జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు అందక కళ్ల ముందే తమ వారు చనిపోతుండటంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలియడంతో హాస్పిటల్లో తనిఖీ చేసి జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యులను విచారించారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే తమ వారు మరణించారని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News