వెదర్ అలర్ట్: 10 రోజుల పాటు వర్షాలే

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడుతుండగా.. రానున్న 10 రోజుల పాటు ఏపీలో అక్కడకక్కడ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది. ఇక గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ […]

Update: 2021-04-13 23:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. దక్షిణ బంగాళాఖాతం నుంచి వస్తున్న తేమగాలులు, ఉత్తర బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో అధిక పీడన ప్రాంతాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు పడుతుండగా.. రానున్న 10 రోజుల పాటు ఏపీలో అక్కడకక్కడ వర్షాలు పడతాయని విశాఖ వాతావరణశాఖ స్పష్టం చేసింది. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంది.

ఇక గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరకోస్తా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఉదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

Tags:    

Similar News