రిమ్స్‌లో 10 మంది కరోనా రోగులు మిస్సింగ్?
దిశప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుంచి పది మంది కరోనా బాధితుల పరారీ కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఐసోలేషన్ వార్డు నుంచి ఇప్పటికే ఆరుగురు బాధితులు పరారీలో ఉన్నారు. కాగా, మరో నలుగురు కరోనా అనుమానంతో ఐసొలేషన్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది. వారి శాంపిళ్లను సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఫలితాలు రావడానికి ముందే వీరు పరారీ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ వ్యవహారం […]
దిశప్రతినిధి, ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుంచి పది మంది కరోనా బాధితుల పరారీ కలకలం రేపుతోంది. శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఐసోలేషన్ వార్డు నుంచి ఇప్పటికే ఆరుగురు బాధితులు పరారీలో ఉన్నారు. కాగా, మరో నలుగురు కరోనా అనుమానంతో ఐసొలేషన్ వార్డులో చేరినట్లు తెలుస్తోంది.
వారి శాంపిళ్లను సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు తరలించారు. ఫలితాలు రావడానికి ముందే వీరు పరారీ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ వ్యవహారం రిమ్స్ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఆస్పత్రిలో సరైన సేవలు అందించడంలో జరుగుతున్న జాప్యం కారణంగానే వీరు పరారైనట్లు ప్రచారం జరుగుతోంది. పరారీ అయిన వారిలో చాందా( టి), ఖానాపూర్, ఆదిలాబాదు టౌన్ ,ఇంద్రవెల్లి ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం.