కరోనా నుంచి కోలుకున్న బిగ్‌బీ అమితాబ్ బచ్చన్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆయన ఆదివారం ముంబైలోని నానావతి ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. తాజాగా అమితాబ్‌కు కరోనా టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చిందన్నారు. దీంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అభిషేక్ తెలిపారు. కాగా, గత కొన్ని రోజుల క్రితం బచ్చన్ ఫ్యామిలిలో కుమారుడు అభిషేక్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య, తాను వైరస్ భారిన పడిన సంగతి తెలిసిందే. వైరస్ నుంచి అమితాబ్, ఐశ్వర్యరాయ్, ఆరాధ్య కోలుకోగా.. అభిషేక్ మాత్రం ఇంకా వైరస్ తో పోరాడుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement