నా ప్రయాణంలో మరో సవాల్ : బిగ్‌బీ

by Shyam |
నా ప్రయాణంలో మరో సవాల్ : బిగ్‌బీ
X

అమితాబ్ బచ్చన్.. భారతీయ సినీ చరిత్రలో ఆయనదొక సువర్ణ అధ్యాయం. 1969లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బిగ్‌బీ.. తన 51 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. మరెన్నో మార్పులకి సాక్షిగా నిలిచారు. తాజాగా ఈ విషయాల గురించి ప్రస్తావిస్తూ.. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ షేర్ చేశారు బచ్చన్ జీ.

1969-2020 వరకు సినిమాల్లో ఎన్నో కీలక మలుపులు, మార్పులు చూసిన ఆయన.. ఇప్పుడు మరో సవాల్‌లో భాగమైనందుకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తన చిత్రం ‘గులాబో సితాబో’ డిజిటల్‌లో విడుదలవతుండటం సంతోషాన్నిస్తున్నట్లు చెప్పారు. జూన్ 12న అమెజాన్ ప్రైమ్‌లో సినిమా రిలీజ్ అవుతున్నట్లు చెప్పిన బచ్చన్.. ప్రపంచ వ్యాప్తంగా 200కు పైగా దేశాల్లో మూవీ రిలీజ్ కానుండటం అమేజింగ్ ఫీలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రల్లో సుజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన గులాబో సితాబో సినిమాను.. సన్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ నిర్మించింది. కాగా ఏప్రిల్ 17న సినిమాను విడుదల చేయాలని మూవీ యూనిట్ నిర్ణయించగా కరోనా కారణంగా వాయిదా పడింది. దీంతో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు నిర్మాతలు. కాగా ఈ సినిమా ఇండియన్ ఎంటర్టైన్‌మెంట్‌లో ఒక చరిత్రకు నాంది పలికిందన్నారు డైరెక్టర్ సుజిత్ సర్కార్.

Advertisement

Next Story