కునాల్‌ను కీర్తించిన బచ్చన్ జీ..

by Jakkula Samataha |
కునాల్‌ను కీర్తించిన బచ్చన్ జీ..
X

ది గ్రేట్ అమితాబ్ బచ్చన్.. ‘లూట్‌కేస్’ సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్ మీడియాలో నోట్ షేర్ చేస్తూ హీరో కునాల్ ఖేముతో పాటు టెక్నీషియన్స్, యాక్టర్స్‌ను అభినందించారు. రైటింగ్, డైరెక్షన్, పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉందన్న బచ్చన్ జీ.. కునాల్ నటన అసాధారణమని కీర్తించాడు. ఎక్స్‌ప్రెషన్, బాడీ మూవ్‌మెంట్, పాత్రలో లీనమైన విధానం ఔట్ స్టాండింగ్ అంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. ఇదే కంటిన్యూ చేసి గొప్ప స్టార్‌గా ఎదగాలని విష్ చేశాడు.

దీనిపై స్పందించిన కునాల్.. చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ‘బచ్చన్ సాబ్ నుంచి ఇలాంటి ప్రశంస అందుకుంటానా లేదా అనుకునేవాడిని.. ఈ కాంప్లిమెంటరీ నోట్‌తో తన జీవితం ధన్యమైంది’ అని చెప్పాడు. ఇది తన లైఫ్‌లో చాలా గొప్ప విషయమని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed