- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బీ ఎనర్జీకి నెటిజన్స్ ఫిదా!
బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ రావడంతో అభిమానులు ఆందోళన చెందారు. ఆయన కరోనా నుంచి కోలుకోవాలంటూ ప్రార్ధనలు చేశారు. ఎన్నో ప్రాణాంతక రోగాలతో పోరాడిన బచ్చన్.. కరోనాను జయిస్తాడనే ధీమాతో ఉన్నా సరే, వైద్యులు తన ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని చెప్పే వరకు కాస్త భయపడిపోయారు. అయితే అలాంటి భయాలేమీ పెట్టుకోవద్దంటూ బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
బిగ్ బీ ఎనర్జీ లెవల్ ఎలా ఉంటుందో చూపుతున్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అమితాబ్‌తో స్టేడియంలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం ఇంకా గుర్తుందన్న అనిల్.. తన ప్రేమ, శక్తికి సాటిలేవని చెప్పాడు. ఈ వీడియోలో యంగ్‌గా ఉన్న బచ్చన్‌జీ అభిమానులను ఎంటర్‌టైన్ చేసేందుకు, వారిలో ఎనర్జీ నింపేందుకు తన చొక్కా విసిరేసి మరీ పాటపాడుతూ డ్యాన్స్ చేశాడు. అంతేకాదు అనిల్ కపూర్ చొక్కా కూడా విసిరేస్తూ తనతో కలిసి స్టెప్పులు వేశాడు. అంత ఎనర్జీ ఉన్న బచ్చన్‌జీ కరోనా నుంచి త్వరగా కోలుకుంటారన్న అనిల్.. బచ్చన్‌కు నచ్చిన పనిని చేసేందుకు తర్వగా వచ్చేస్తారని వెయిట్ చేస్తున్నట్లు తెలిపారు.