- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎం రమేశ్, సుజనా చౌదరిలకు అమిత్ షా కీలక సూచన..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టి సారించారు. తిరుపతిలోని తాజ్ హోటల్‌లో ఉన్న అమిత్ షా సోమవారం బీజేపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తొలుత బీజేపీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లతో గంటకు పైగా చర్చించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావాలంటే చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. మరోవైపు టీడీపీతో దూరంగా ఉండాలని ఇద్దరు నేతలకు సూచించారు.
ఇటీవల కాలంలో టీడీపీ పొత్తు నేపథ్యంలో సోము వీర్రాజు, జీవీఎల్ నరసింహారావుతోపాటు పలువురు టీడీపీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. అయితే మీరెవరు చెప్పడానికి అంటూ సీఎం రమేశ్ కౌంటర్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా.. సీఎం రమేశ్, సుజనా చౌదరిలతో భేటీ అయ్యారు. గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు వేరని.. ఇకపై టీడీపీతో సఖ్యత మంచిది కాదని సూచించారు. టీడీపీని దూరం పెట్టాల్సిందేనని అమిత్ షా ఖచ్చితంగా తేల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.